భారతదేశం, నవంబర్ 17 -- బిగ్ బాస్ శివాజీ, హీరో నవదీప్, నందు, రవికృష్ణ, బిందు మాధవి, మౌనిక రెడ్డి, మనికా చిక్కాల, రాధ్య, అదితి భావరాజు ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ రూరల్ బ్యాక్‌డ్రాప్ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా చిత్రం దండోరా.

నేష‌న‌ల్ అవార్డ్ గెలుచుకున్న సినిమా 'క‌ల‌ర్ ఫోటో', బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 'బెదురులంక 2012' చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీనే 'దండోరా'.

ఈ సినిమాకు ముర‌ళీకాంత్ ద‌ర్శ‌క‌త్వం వహించారు. డిసెంబ‌ర్ 25న దండోరా సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఇవాళ సోమ‌వారం (నవంబర్ 17) దండోరా మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. అదిరిపోయే డైలాగ్స్‌తో ఆద్యంతం దండోరా టీజర్ ఆకట్టుకుంది.

ఓవైపు రొమాంటిక...