Telangana,hyderabad, సెప్టెంబర్ 25 -- ఆ ముగ్గురు బాలికలు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. బతుకమ్మ వేడుకల కోసమని ఈనెల 20వ తేదీన ఇంట్లో నుంచి బయటికి వచ్చారు. వీరికి ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. బాలికలను మాటల్లో పెట్టిన అతగాడు.వీరిపై కన్నేశాడు. మరో ఇద్దరు స్నేహితులను అక్కడికి పిలిపించాడు. ఆపై అందరూ కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత ఏదైనా యాత్రకు వెళ్దామని చెప్పి వారిని నమ్మించి యాదాద్రికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలో వెలుగు చూసింది.

ప్రాథమిక వివరాల ప్రకారం..ఈ ఘటన సెప్టెంబర్ 21న వెలుగులోకి వచ్చింది. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికలను ముగ్గురు యువకులు ప్రలోభాలకు గురి చేశారు. సెప్టెంబర్ 20వ తేదీనే ఒక యాత్ర సాకుతో యాదగిరిగుట్టకు తీసుకెళ్లారు. అక్కడ ఓ లాడ్జిని బుక్ చేశారు. ఆపై ముగ్గురి బాలికలపై యువకులు అత్యాచారానికి పాల్పడ...