భారతదేశం, డిసెంబర్ 14 -- తెలంగాణ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోరు ముగిసింది. రెండో దశలో 193 మండలాల్లోని 3911 గ్రామ పంచాయతీలకు, 29911 వార్డు మెంబర్ల కోసం పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగింది. రెండు గంటలకు ఓట్లు లెక్కింపు మెుదలుపెట్టారు. రెండో విడత పోలింగ్‌లో భాగంగా సుమారు 57 లక్షల 22 వేలకుపైగా ఓటర్లు పాల్గొన్నారు.

ఆదివారం కావడంతో ఊర్లలో కూడా సందడి నెలకొంది. పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా ఓటు వేసేందుకు తరలివచ్చారు. 12,782 మంది సర్పంచ్ అభ్యర్థులు, 71,071 మంది వార్డు మెంబర్ల అభ్యర్థులు బరిలో ఉన్నారు. 38,337 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. 57 లక్షల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఉదయం 9 గంటల వరకు 22.54 శాతం పోలింగ్ నమోదు అయిం...