భారతదేశం, అక్టోబర్ 20 -- Tirumala Navaratri Brahmotsavam 2026 Updates : తిరుమల క్షేత్రంలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో విజయవంతంగా ముగిశాయి. అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు ఎనిమిది రోజుల పాటు సాగిన ఈ ఉత్సవాల్లో భారీ వర్షాలు కురిసినప్పటికీ భక్తుల భక్తిప్రపత్తులకు ఎలాంటి విఘాతం కలగలేదు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు అంకితభావంతో అహోరాత్రులు సేవలందించారు.

ఈ 8 రోజుల బ్రహ్మోత్సవాల వ్యవధిలో మొత్తం 6.46 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా స్వామివారి హుండీకి రూ.25.79 కోట్ల ఆదాయం లభించింది. అదేవిధంగా భక్తుల ఆకలి తీర్చేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల కాలంలో ఏకం...