మీ SSC సర్టిఫికేట్లో తప్పులా? మీసేవా ద్వారా దరఖాస్తు చేసుకునే విధానం ఇదిగో
భారతదేశం, నవంబర్ 21 -- పదో తరగతి ఒరిజినల్ మెమోలలో పేరు, తల్లిదండ్రుల పేర్లు లేదా పుట్టిన తేదీ వంటి వ్యక్తిగత వివరాల్లో తప్పులు దొర్లితే, వాటిని సరిచేయించుకోవడానికి విద్యార్థులు, తల్లిదండ్రులు నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని ఇకపై ఉండదు. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆఫ్లైన్ దరఖాస్తు విధానానికి పూర్తిగా స్వస్తి పలుకుతూ కీలక నిర్ణయం తీసుకుంది. టెన్త్ సర్టిఫికెట్ల సవరణ ప్రక్రియ మొత్తాన్ని ఇక మీదట మీసేవ(MeeSeva) పోర్టల్ ద్వారా పూర్తిగా ఆన్లైన్లోకి మార్చింది.
ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒరిజినల్ ఎస్ఎస్సీ సర్టిఫికెట్లలోని వివరాల సవరణ ప్రతిపాదనల సమర్పణ, పరిశీలన ప్రక్రియ మొత్తం ఇకపై మీసేవ పోర్టల్ ద్వారానే జరగాలని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో విద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.