భారతదేశం, డిసెంబర్ 23 -- సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. 2026 ఏప్రిల్ 1 నుంచి ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ మీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఖాతాలతో పాటు, వ్యక్తిగత ఈమెయిల్స్‌ను కూడా తనిఖీ చేసే అధికారం పొందుతుందని ఆ వార్త సారాంశం. పన్ను ఎగవేతను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ప్రచారంలో అసలు నిజమెంత ఉందో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) తన ఫ్యాక్ట్-చెక్ నివేదికలో వెల్లడించింది.

"సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉంది. ఆదాయపు పన్ను చట్టం 2025లోని సెక్షన్ 247 ప్రకారం.. డిజిటల్ డేటాను సేకరించే అధికారం కేవలం 'సెర్చ్ అండ్ సర్వే' (సోదాలు) నిర్వహించేటప్పుడు మాత్రమే ఉంటుంది" అని పిఐబి స్పష్టం చేసింది. అంటే, ఎవరైతే భారీగా పన...