భారతదేశం, నవంబర్ 4 -- భారతదేశంలో, ప్రతి 28 మంది మహిళల్లో ఒకరికి వారి జీవితకాలంలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అందుకే, క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే, ప్రాణాలను కాపాడుకునే అవకాశం అంత ఎక్కువగా ఉంటుందంటున్నారు మెడ్‌జీనోమ్ సైంటిఫిక్ అఫైర్స్ హెడ్ డాక్టర్ ప్రశాంత్ బాగాలి. దీనిపై డాక్టర్ అందిస్తున్న ప్రత్యేక కథనం.. వారి మాటల్లోనే

'ఢిల్లీకి చెందిన ప్రముఖ జెనోమిక్ నిపుణురాలు డాక్టర్ షీలాకు ఈ చేదు నిజం తన కుటుంబానికి సంబంధించినప్పుడు వ్యక్తిగతమైంది. ఆమె పెద్ద అత్తగారికి అండాశయ క్యాన్సర్ (Ovarian Cancer) ఉన్నట్లు తేలింది. జన్యుపరమైన ప్రమాదాల గురించి బాగా తెలిసిన నిపుణురాలిగా, ఆమె తక్షణమే తన కుటుంబంలోని మహిళలందరికీ జన్యు స్క్రీనింగ్‌లు చేయించడం మొదలుపెట్టారు. ఆ ఫలితాలు నిజంగా ఆమెకు కనువిప్పు కలిగించాయి. అదే సమయంలో ప్రాణాలను కాపాడాయి.

ఆమె...