భారతదేశం, ఆగస్టు 12 -- పిల్లల పెంపకంలో పోషకాహారం చాలా కీలకం. కానీ, చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన పోషకాలు అందుతున్నాయో లేదో గమనించడంలో విఫలమవుతుంటారు. పోషకాహార లోపం పిల్లల ఎదుగుదల, అభివృద్ధి, ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతుంది. ఈ లోపాలను కొన్నిసార్లు గమనించలేం, కానీ అవి పిల్లల ఆరోగ్యంపై నిశ్శబ్దంగా ప్రభావం చూపుతూ ఉంటాయి.

మాలిక్ రాడిక్స్ హెల్త్‌కేర్ వ్యవస్థాపకుడు, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రవి మాలిక్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "మీ పిల్లలు చూడ్డానికి చురుగ్గా, ఆరోగ్యంగా ఉన్నట్టు కనిపించవచ్చు, కానీ పోషక లోపాలు వారి ఎదుగుదల, రోగ నిరోధక శక్తి, ఏకాగ్రతపై ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా, సరిగా తినని పిల్లల్లో ఈ లోపాలు తరచుగా గుర్తించరు" అని తెలిపారు.

తల్లిదండ్రులు తప్పకుండా గమనించాల్సిన పోషకాహార లోపానికి సంబంధించిన 5 లక్షణాలు ఇక్క...