Andhrapradesh, ఆగస్టు 23 -- వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ అనుమతులపై ఏపీ పోలీసులు కీలక ప్రకటన చేశారు. సులభంగా ఆన్ లైన్ లోనే అనుమతులు తీసుకునేందుకు వీలుగా ప్రత్యేక పోర్టల్ ను ప్రారంభించింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

వినాయక మండపానికి సంబంధించి ఆన్ లైన్ లోనే అప్లికేషన్ చేసుకోవచ్చని పోలీసులు స్పష్టం చేశారు. ఇక అనుమతులు కావాలంటే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్మిషన్ పత్రాన్ని పొందవచ్చని సూచించారు.

ఆన్ లైన్ దరఖాస్తు సమర్పించిన తర్వాత.. సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారి ప్రతిపాదిత స్థలాన్ని తనిఖీ చేస్తారు. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటే. QR కోడ్ తో కూడిన ఎన్వోసీ జారీ అవుతుందని పోలీస్ శాఖ తెలిపింది. ఉచితంగానే అనుమతుల ప్రక్రియ ఉంటుందని పేర్కొంది.

దరఖాస్తు ప్రక్రియ పూ...