భారతదేశం, అక్టోబర్ 2 -- తెలంగాణలో ఇప్పుడు మెుత్తం స్మార్ట్ రేషన్ కార్డులే. ఇప్పటికే దాదాపుగా అందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చేశాయి. అయితే కుటుంబ యజమాని పేరు ఉండి.. మిగతా వారి పేర్లు కనిపించడం లేదని కంగారు పడుతున్నారు. కానీ మీరు ఇదే స్మార్ట్ రేషన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందులో ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్‌తో కూడిన వివరాలు కూడా ఉంటాయి. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్లినప్పుడు.. మీ ఫోన్ నుంచి దానిని జిరాక్స్ తీసి ఇచ్చేస్తే సరిపోతుంది. స్మార్ట్ రేషన్ కార్డు ఫోన్‌లో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూడండి.

తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న నూతన స్మార్ట్ రేషన్ కార్డుల ప్రక్రియ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 90 శాతం వరకు పూర్తయింది. కుటుంబ సభ్యుల వివరాలు స్మార్ట్ రేషన్ కార్డులో కనిపించడం లేదని కొందరి ఆందోళన. అయితే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవ...