భారతదేశం, సెప్టెంబర్ 2 -- ఆచార్య చాణక్యుని భారతీయ చరిత్రలో అత్య గొప్ప అర్థశాస్త్రవేత్తగా, దూరదృష్టి గల నీతిజ్ఞుడిగా కొలుస్తారు. తన అసాధారణ రాజకీయ చతురతతో సాధారణ బాలుడైన చంద్రగుప్తుడిని మౌర్య సామ్రాజ్యానికి చక్రవర్తిగా చేసిన ఘనత ఆయనది. శతాబ్దాలు గడిచినా, నేటి ఆధునిక కాలంలోనూ చాణక్య నీతులు మానవ జీవితానికి దిశానిర్దేశం చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ధన సంపాదన, కుటుంబ నిర్వహణ, సంపద నిలకడ గురించి ఆయన చెప్పిన సూత్రాలు నేటికీ ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

లక్ష్మీదేవి ఎంతో చంచలమైనదానిగా చెబుతారు. అంటే ఆమె ఎప్పుడూ ఒకచోట స్థిరంగా ఉండదనే అంటారు. అయితే, కొన్ని ప్రత్యేకమైన వాతావరణం, సత్ప్రవర్తన ఉన్న ఇళ్లలో మాత్రం లక్ష్మీదేవి ఎప్పటికీ కొలువై ఉంటుందని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో స్పష్టం చేశారు. ఆ అదృష్టకరమైన పరిస్థితులు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఓ ప్రసి...