భారతదేశం, ఆగస్టు 29 -- ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది కోట్లాది మంది యువత కల. దీనికోసం పగలు అనక, రాత్రి అనక కష్టపడతారు, ఎన్నో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతారు. అయినప్పటికీ కొందరికి ఆశించిన విజయం దక్కదు. సరైన ప్రణాళికతో చదివినా ఎక్కడో ఒకచోట లోపం జరిగిపోతుంటుంది. నిరంతరం శ్రమించినా ఫలితం దక్కనప్పుడు తీవ్రమైన నిరాశ కమ్ముకుంటుంది. అయితే, మన జ్యోతిష్యం మరియు హస్తసాముద్రికం ప్రకారం.. దీనికి కేవలం మన ప్రిపరేషన్ లోపమే కాకుండా, అరచేతిలోని కొన్ని ప్రత్యేక రేఖల అడ్డంకులు కూడా కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు.

మనం ఎంత కష్టపడినా జీవితంలో ఎదురుదెబ్బలు తగులుతుంటే, హస్త రేఖల ద్వారా ఆ సమస్యల మూలాలను తెలుసుకునే అవకాశం ఉంది. సమయానికి తగినట్లుగా కొన్ని చిన్నపాటి పరిహారాలు పాటిస్తే ఈ అడ్డంకులను అధిగమించవచ్చు.

హస్తసాముద్రికం ప్రకారం ఒక వ్యక్తి కెరీర్ ఎలా ...