భారతదేశం, సెప్టెంబర్ 18 -- టీవీ చూస్తూనో, ఓటీటీలో ఏదైనా సిరీస్ చూస్తూనో సోఫాలో గంటల తరబడి గడిపేస్తుంటాం. అలాంటప్పుడు తెలియకుండానే ఒంటిని వంచి కూర్చోవడం అలవాటుగా మారిపోతుంది. ఆ సమయంలో బాగానే ఉన్నా, తర్వాత వెన్ను పట్టేసినట్లు, భుజాలు బిగుసుకుపోయినట్లు, మెడ నొప్పులు అనిపిస్తుంటాయి. ఇలా వంగి కూర్చోవడం వల్ల వెన్నునొప్పి, మెడనొప్పి మాత్రమే కాకుండా, శరీర భంగిమ దెబ్బతిని, బ్యాలెన్స్ కోల్పోవడం, తలనొప్పులు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ పేర్కొంది.

ఈ సమస్యలను అధిగమించడానికి యోగా అద్భుతంగా పనిచేస్తుంది. బిగుసుకుపోయిన కండరాలను వదులు చేసి, శరీర కండరాలను బలోపేతం చేసి, ఒంటి వశ్యతను పెంచుతుంది. యోగా ట్రైనర్ అన్షుకా పర్వానీ కూడా ఈ విషయాన్నే చెబుతున్నారు. "మనం సోఫాలో వంగి కూర్చున్నప్పుడు వెన్ను...