భారతదేశం, మే 3 -- ఇంట్లోకి వెళ్లేప్పుడు చెప్పులు ఎక్కడ విప్పుతామో చాలా మందికి క్లారిటీ ఉండదు. త్వరత్వరగా వచ్చేస్తూ.. చిందరవందరగా విప్పేస్తాం. ఓ చెప్పు ఓ వైపు ఉంటే.. ఇంకో చెప్పు ఎక్కడో పడి ఉంటుంది. కానీ ఇది చాలా తప్పు. ఈ చిన్న అజాగ్రత్త మీ వృత్తి జీవితంలో పెద్ద అడ్డంకిని సృష్టిస్తోంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం అదృష్టం, సంతోషం, శ్రేయస్సు, సానుకూల శక్తికి ప్రవేశ ద్వారం. అక్కడ షూలు, చెప్పులు చెల్లాచెదురుగా పడేస్తే.. అది సమస్యలను సృష్టిస్తోంది. అంతేకాకుండా ఇది రాహువును ఉత్తేజపరిచి, చాలా ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేస్తుందని చెబుతుంటారు.

మన పాదాలకు మీన రాశితో ప్రత్యక్ష సంబంధం ఉంది. శరీరంలోని చివరి భాగం, రాశిచక్రంలోని చివరి రాశి అయిన మీన రాశికి పాదాలతో సంబంధం ఉంది. పాదాల అరికాళ్ళు, పాదరక్షలకు శని, రాహువులతో కూడా సంబంధం ఉంది. మనం...