భారతదేశం, జూన్ 28 -- రాశి చక్రంలో చివరిదైన మీన రాశి వారికి ఈ వారం ఎంతో కీలకమైన మార్పులను తీసుకువస్తుంది. వారం ప్రారంభం ఎంతో ఉత్సాహంగా, ఇతరుల సహకారంతో మొదలవుతుంది. కార్యాలయాల్లో పైఅధికారులు, సమాజంలో గౌరవనీయ వ్యక్తులు మీ ఆలోచనలకు మద్దతు ఇస్తారు. ఇటీవల మీ శ్రమకు సరైన గుర్తింపు దక్కలేదని ఆందోళన పడేవారికి ఈ వారం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.

గురుడి శుభ దృష్టి ప్రభావంతో మీ ఆలోచనల పరిధి పెరుగుతుంది. అదనపు ఆదాయ మార్గాలు, వ్యాపార విస్తరణ లేదా కొత్త క్లయింట్లను ఆకర్షించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కుటుంబంలో భాగస్వామి వల్ల ప్రశాంతత లభిస్తుంది. అయితే, పిల్లల ఆరోగ్యం లేదా వారి ప్రవర్తన కొంత ఆందోళన కలిగించవచ్చు. వారం మధ్యలో పని వాతావరణం మెరుగై మానసిక ఒత్తిడి తగ్గుతుంది. తండ్రి లాంటి పెద్దల నుంచి ఆశించిన సాయం అందుతుంది. తల్లి లేదా ఇంట్లోని వృద్ధ...