భారతదేశం, మార్చి 12 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. మార్చి 14న సూర్యుడు కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ప్రతి నెలా సూర్యుడు కొత్త సంచారంలో మార్పు చేస్తూ ఉంటాడు. మార్చి 14న సూర్య సంచారం జరగడంతో కొన్ని రాశుల వారిపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 12 రాశుల వారిపై సూర్య సంచారం ప్రభావం చూపిస్తుంది. మరి ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావం పడిందో తెలుసుకుందాం.

మేష రాశి వారికి సూర్య సంచారం వలన పాత సమస్యల కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి ఖర్చులు పెరిగిపోతాయి. జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

ఈ రాశి వారికి 11వ ఇంట్లో సూర్య సంచారం జరుగుతోంది. ఈ సమయంలో ఈ రాశి వారు పురోగతిని చూస్తారు. పెండింగ్‌లో ఉన్న ...