భారతదేశం, ఆగస్టు 27 -- భాద్రపద మాసం శుక్ల పక్ష వినాయక చవితి ఆగస్టు 27, 2025న వచ్చింది. గణేష్ చతుర్థి నాడు గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించి, పూజించి, గణేశుడికి ఇష్టమైన మోదకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ప్రతి ఉదయం, సాయంత్రం పూజలు చేస్తారు. వినాయక చవితిని భక్తులు చాలా ప్రత్యేకమైనది భావిస్తారు. ఇలాంటి వేడుకకు సంబంధించిన విషెస్‌ను మీకు ఇష్టమైన వారికి పంపండి. మీ కోసం కొన్ని గణేష్ చతుర్థి శుభాకాంక్షలు అందిస్తున్నాం.

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే

మీకు, మీ కుటుంబ సభ్యులకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు

అన్ని శుభ కార్యాలలో మొదట పూజించేది నిన్నే..

నువ్వు లేకుండా ఏ పని జరగదు.. అలాగే నా అభ్యర్థనను విను..

నేను అనుకున్నది జరిగేలా చూడు విఘ్నేషుడా..

నీ ఆశీస్సులు మా కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి..

అందరి...