భారతదేశం, జూలై 27 -- భారతీయ వినియోగదారులలో ఇంధన సామర్థ్యం కలిగిన కార్లకు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంది. మీరు కూడా రాబోయే కొద్ది రోజుల్లో మైలేజ్ ఇచ్చే బడ్జెట్ సెగ్మెంట్ సీఎన్జీ కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే ఇది మీకు ఉపయోగపడుతుంది.

మిడిల్ క్లాస్ వాళ్లు ఎక్కువగా చూసేది బడ్జెట్‌తోపాటుగా మైలేజీ. మీరు కూడా త్వరలో కార్ తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే.. మీకోసం మార్కెట్‌లో అనేక సీఎన్జీ ఆప్షన్స్ ఉన్నాయి. కస్టమర్లకు 30 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇచ్చే కార్లు భారత మార్కెట్లో చాలానే ఉన్నాయి. బడ్జెట్ సెగ్మెంట్‌లో 5 బెస్ట్ ఫ్యూయల్ ఎఫిషియెన్సీ కార్ల గురించి తెలుసుకుందాం.

మారుతి సుజుకి డిజైర్ ఇంధన సామర్థ్యం గల కార్ల విభాగంలో గొప్ప ఎంపిక అని నిరూపించవచ్చు. మారుతి సుజుకి డిజైర్ దాని పెట్రోల్ వేరియంట్ 25 కిలోమీటర్లు, సీఎన్జీ పవర్ట్రెయిన్తో 34 కిలోమీటర్లకు పైగా...