భారతదేశం, జూలై 3 -- భారత్‌లో ఇంధన ధరల ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వినియోగదారుల జేబులకు ఎల్లప్పుడూ చిల్లు పడుతూనే ఉంటుంది. అందుకే చాలా మంది టూ వీలర్ మైలేజీ ఎంత ఇస్తుందో కొనేముందు అంచనా వేస్తారు. విద్యార్థి అయినా, ఆఫీసుకు వెళ్లేవారైనా, డెలివరీ బాయ్ అయినా పెట్రోల్ ఖర్చును తగ్గించుకోవాలని అనుకుంటారు. ఇందుకోసం మైలేజీ ఇచ్చే బైకులను చూడాలి. అధిక మైలేజీని అందించే భారతదేశంలో టాప్ 5 మోటార్ సైకిళ్లు చూద్దాం..

హీరో స్ప్లెండర్ ప్లస్ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇది కనీస ఇంధన ఖర్చుతో గరిష్ట మైలేజీని ఇచ్చే బైక్. లీటరుకు 70-75 కి.మీ ఇస్తుందని చెబుతారు. సాధారణంగా నగరాలు లేదా పట్టణాల చుట్టూ చిన్న ప్రయాణాలకు సరిపోతుంది. నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువ. డిజైన్‌లో తేలికైనది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.77,226 నుంచి మెుదలవుతుంది

ఈ స్టైలిష...