భారతదేశం, జూన్ 16 -- ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారు జెలియో ఈ మొబిలిటీ ఇటీవలే లిటిల్ గ్రేసీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. లిటిల్ గ్రేసీ మూడు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ. 49,500 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. అన్ని వయసులవారికి ఈ స్కూటర్లు సూట్ అవుతాయి.తక్కువ-వేగంతో నడిచే ఎలక్ట్రిక్ స్కూటర్ అని కంపెనీ చెబుతోంది.

ఈ కొత్త లిటిల్ గ్రేసీ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఇందులో బ్యాటరీ కెపాసిటీ ఆధారంగా ధర, రేంజ్ ఉన్నాయి. వేరియంట్‌లు వాటి బ్యాటరీ ఆప్షన్స్ ద్వారా ఉంటాయి.

60V/30AH లి-అయాన్ బ్యాటరీ కలిగిన స్కూటర్ ధర రూ. 58,000. 8 నుండి 9 గంటల ఛార్జింగ్ సమయంతో 70 నుండి 75 కి.మీ రేంజ్ అందిస్తుంది. అదేవిధంగా 60V/32AH లెడ్ యాసిడ్ బ్యాటరీ కలిగిన స్కూటర్ ధర రూ. 52,000. 7 నుండి 9 గంటల ఛార్జింగ్ సమయంతో 70 కి.మీ రేంజ్...