భారతదేశం, జూలై 4 -- Alia Bhatt Alpha 1st Day Worldwide Box Office Collection: భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత భారీ ఫ్రాంచైజీగా గుర్తింపు తెచ్చుకున్న వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'ఆల్ఫా' (Alpha) జూలై 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన అలియా భట్, ఈ క్రేజీ స్పై యూనివర్స్‌లో మొదటిసారి మహిళా గూఢచారిగా నటించడంతో ఆల్ఫా సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ చిత్రానికి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ఆశించిన స్థాయిలో సానుకూల స్పందన రాలేదు.

ఈ మిశ్రమ టాక్ ప్రభావం సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లపై స్పష్టంగా కనిపించింది. వైఆర్ఎఫ్ స్పై ఫ్రాంచైజీ చరిత్రలోనే అత్యంత తక్కువ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ఆల్ఫా నిలిచింది. ...