భారతదేశం, ఫిబ్రవరి 14 -- టాలీవుడ్ పాపులర్ నిర్మాతల్లో స్వప్న దత్ ఒకరు. ప్రభాస్ కల్కి 2898 ఏడీ, దుల్కర్ సల్మాన్ సీతారామం, కీర్తి సురేశ్ మహానటి, నాని ఎవడే సుబ్రహ్మణ్యం వంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన నిర్మాతల్లో స్వప్న దత్ ఒకరు. ఇటీవల స్వప్న దత్ కపుల్ ఫ్రెండ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు.

సంతోష్ శోభన్, మానస వారణాసి హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ మూవీ కపుల్ ఫ్రెండ్లీ ఇవాళ (ఫిబ్రవరి 14) థియేటర్లలో విడుదల అయింది. అయితే, మూవీ రిలీజ్‌కు 2 రోజుల ముందు ఫిబ్రవరి 12న కపుల్ ఫ్రెండ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో నిర్మాత స్వప్న దత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ప్రొడ్యూసర్ స్వప్న దత్ మాట్లాడుతూ.. "కపుల్ ఫ్రెండ్లీ మూవీ కంటెంట్ కొత్తగా అనిపిస్తోంది. సినిమా కావాల్సినవన్నీ యూవీ సంస్థ ఇస్తుంటుంది. వాళ్ల బ్యానర్ సినిమాలన్నీ...