భారతదేశం, ఫిబ్రవరి 22 -- టాలీవుడ్ లో ఒకప్పుడు వరుస సినిమాలతో సాగిపోయింది సమంత రూత్ ప్రభు. కానీ మధ్యలో గ్యాప్ వచ్చింది. 2023లో రిలీజైన ఖుషీ తర్వాత సమంత తెలుగులో మళ్లీ ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా చేస్తున్న సినిమా మా ఇంటి బంగారం. ఈ మూవీ కోసం తెలుగు ఆడియన్స్, ఆమె ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ ను ఇవాళ మేకర్స్ రివీల్ చేశారు.

కొంత కాలం గ్యాప్ తర్వాత సమంత తెలుగులో హీరోయిన్ గా చేస్తున్న మూవీ 'మా ఇంటి బంగారం'. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఇవాళ (ఫిబ్రవరి 22) అనౌన్స్ చేశారు. వేసవి కానుకంగా ఈ సినిమా మే 15, 2026న థియేటర్లలోకి రాబోతుందని ప్రకటించారు. సామ్ డైరెక్ట్ తెలుగు మూవీ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఇది గుడ్ న్యూస్.

మా ఇంటి బంగారం రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో సమంత ఓ స్పెషల్ పోస్టర్ పంచుకుంది. ఇందులో ఆమె హోమ్...