భారతదేశం, మార్చి 26 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అందరి పై ప్రభావాన్ని చూపిస్తుంది. సూర్యుడు గ్రహాలకు రారాజు. సూర్య సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకొస్తుంది. కాలనుగుణంగా సూర్యుడు తన నక్షత్రాలను, రాశులను మారుస్తూ ఉంటాడు.

మరి కొన్ని రోజుల్లో, అనగా మార్చి 31న, సూర్యుడు ప్రవేశిస్తాడు. సూర్యుడు రేవతి నక్షత్రంలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారి జీవితంలో అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయి. రేవతి నక్షత్రంలోకి సూర్యుడు మార్చి 31, మంగళవారం రాత్రి 8:16కి అడుగు పెడతాడు. ఏప్రిల్ 14 వరకు ఈ నక్షత్రంలోనే సంచారం చేస్తాడు. సూర్య నక్షత్ర సంచారం కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలను తీసుకురాబోతోంది. ఈ రాశుల వారు అనేక విధాలుగా లాభాలను పొందబోతున్నారు. మ...