భారతదేశం, ఫిబ్రవరి 27 -- తెలంగాణ ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకంలోని లబ్ధిదారుల కోసం చిప్ ఆధారిత స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టనుంది. మార్చి మధ్య నుండి పైలట్ ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే స్మార్ట్ కార్డుల కోసం టెండర్లు పిలిచారు అధికారులు. పైలట్ అమలు కోసం ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని ఎంపిక చేస్తామని టీజీఎస్ఆర్టీసీ భావిస్తోంది.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు అందిస్తోంది. లక్షల మంది మహిళలకు ఈ పథకం వరంగా మారింది. ప్రస్తుతం మహిళలు బస్సులో వెళ్తుంటే కండక్టర్‌కు ఆధార్ కార్డు చూపించి.. జీరో టికెట్ తీసుకుంటున్నారు. ఈ విధానానికి ఆర్టీసీ గుడ్‌బై చెబుతోంది. ఇకపై స్మార్ట్ కార్డులను చూపిస్తే సరిపోతుంది.

స్మార్ట్ కార్డు...