భారతదేశం, ఆగస్టు 5 -- పేదరిక నిర్మూలనకు చేపడుతున్న జీరో పావర్టీ-పీ4 లక్ష్యం 2029 నాటికి సాకారం అవుతుందని.. ఇదే మొదటి అడుగు అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో చేపట్టిన పీ4 కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.

మంగళవారం సచివాలయంలో పీ4పై ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 19వ తేదీ నుంచి పీ4 అమలు చేయాలని ఈ సమీక్షలో నిర్ణయించారు. సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షకు సీఎస్ విజయానంద్, ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్, పీ4 ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ఆర్ధిక, ప్రణాళిక శాఖ అధికారులు హాజరయ్యారు. సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ "పేదరిక నిర్మూలనలో భాగంగానే పీ4 కార్యక్రమాన్ని చేపట్టాం. బంగారు కుటుంబాలకు మెరుగైన జీవన ప...