భారతదేశం, ఆగస్టు 21 -- మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై దాఖలైన క్రిమినల్ కేసును రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP)ను భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ ప్రసన్న వరాలేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. 2025 ఆగస్టు 4న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించినట్లు పేర్కొంది.

విచారణ సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ లోకస్ స్టాండీ (పిటిషన్ దాఖలు చేసే అర్హత)పై సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నలు గుప్పించిందని మార్గదర్శి సంస్థ తెలిపింది. వాదనల సరళిని పరిశీలిస్తే ఇది వ్యక్తుల మధ్య ఉన్న వ్యక్తిగత వివాదంగా కనిపిస్తోందన...