భారతదేశం, జూన్ 8 -- భారతదేశ ప్యాసింజర్ వాహన మార్కెట్లో విపరీతమైన పోటీ నెలకొంది. దీంతో హ్యుందాయ్ తన పట్టును బలోపేతం చేసుకోవడానికి రెడీ అవుతోంది. 2030 నాటికి కంపెనీ 26 కొత్త మోడళ్లను భారతదేశంలో విడుదల చేయనుంది. ఇందులో కొత్త కార్లు, ఫేస్ లిఫ్ట్ వెర్షన్లు, హైబ్రిడ్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటాయి.

హ్యుందాయ్ చాలా కాలంగా భారతదేశంలో గట్టి పోటీని ఎదుర్కొంటోంది. టాటా, మహీంద్రాలాంటి కంపెనీల వేగవంతమైన వృద్ధి సవాలుగా మారింది. అటువంటి పరిస్థితిలో హ్యుందాయ్ దేశీయ డిమాండ్‌ను తీర్చడమే కాకుండా, దక్షిణ కొరియా తరువాత అతిపెద్ద ఎగుమతి కేంద్రంగా చేయాలనుకుంటోంది.

హ్యుందాయ్ బయాన్ (2026) హ్యుందాయ్ ఐ20 ఆధారిత క్రాసోవర్ మారుతి ఫ్రాంక్స్‌కు ప్రత్యర్థిగా ఉంటుంది. ధర రూ.10 లక్షల నుంచి ప్రారంభమై రూ.12 లక్షల వరకు ఉంటుంది. ఇది 2026 మధ్య నాటికి లాంచ్ కానుంది.

న్యూ-జెన్ వ...