భారతదేశం, అక్టోబర్ 11 -- రాయలసీమలో పెద్ద మార్కెట్‌గా పేరుగాంచిన కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈసారి సందడి కరువైంది. ఏటా ఈ సీజన్ ప్రారంభంలో వేలాది క్వింటాళ్ల ఉల్లిపాయలు, ఇతర ధాన్యాలతో కిటకిటలాడే యార్డు, ప్రస్తుతం వెలవెలబోతోంది. వర్షాభావ పరిస్థితులు, విపరీతమైన ఎల్ నినో ప్రతికూల వాతావరణ ప్రభావం వల్ల పంటల సాగు తగ్గడం, ఫలితంగా ఉత్పత్తి దారుణంగా పడిపోవడమే దీనికి ప్రధాన కారణమని వ్యాపారులు వెల్లడిస్తున్నారు.

గతేడాది సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 మధ్య కాలంలో కర్నూలు యార్డుకు సుమారు 1.46 లక్షల క్వింటాళ్ల ఉల్లి విక్రయానికి వచ్చింది. అయితే ఈ ఏడాది అదే సమయానికి మార్కెట్‌కు వచ్చిన ఉల్లి పరిమాణం 40,000 క్వింటాళ్లకు కూడా చేరుకోలేదు. గతేడాదితో పోలిస్తే ఇది 30 శాతం కంటే తక్కువగా ఉండటం గమనార్హం.

సరిపడా దిగుబడులు లేకపోవడం, మార్కెట్‌కు ఉల్లి రాక తగ్గడ...