భారతదేశం, జూన్ 12 -- భారత స్టాక్ మార్కెట్లలో శుక్రవారం (జూన్ 12) రికార్డు స్థాయి ర్యాలీ నమోదైంది. అంతర్జాతీయంగా వెలువడిన సానుకూల పవనాలతో దలాల్ స్ట్రీట్ వన్‌వే ర్యాలీతో దూసుకెళ్లింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 1,695.40 పాయింట్లు (2.30 శాతం) లాభపడి 75,527.95 వద్ద ముగిసింది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 50 కూడా 461.30 పాయింట్లు (1.99 శాతం) పుంజుకుని 23,622.90 వద్ద స్థిరపడింది.

అమెరికా-ఇరాన్ మధ్య వచ్చే వారమే శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్న వార్తలు మార్కెట్లలో సరికొత్త జోష్ నింపాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు (క్రూడ్ ఆయిల్) ధరలు ఒక్కసారిగా 5 శాతం మేర పతనమయ్యాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 90 డాలర్ల దిగువకు పడిపోవడంతో, చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్‌కు ద్రవ్యోల్బణ భయాలు తగ్గాయి. ఐ...