భారతదేశం, ఏప్రిల్ 1 -- నిర్లక్ష్యం కారణంగా బస్సు ప్రమాదంలో ఇటీవల 14 మంది ప్రాణాలు కోల్పోగా 29 మంది గాయపడ్డారు. ఘోర ప్రమాదానికి సంబంధించి మార్కాపురం జిల్లా పోలీసులు ఆ ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్, యజమానిని అరెస్టు చేశారు. ప్రయాణ సమయంలో బస్సు పలుమార్లు ఆగిపోయినప్పటికీ, ప్రయాణాన్ని కొనసాగించారు.

మార్చి 26వ తేదీన ఉదయం సుమారు 5.40 గంటలకు ఎన్‌హెచ్-565పై రాయవరం గ్రామం సమీపంలో ఘటన జరిగింది. హరి కృష్ణ ట్రావెల్స్ బస్సు తెలంగాణలోని జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కలిగిరి వెళ్తున్న సమయంలో ప్రమాదం అయింది.

21 ఏళ్ల పాండెం యువరాజు అనే డ్రైవర్‌కు డ్రైవింగ్ లైసెన్స్ లేదని, అతను గతంలో క్లీనర్‌గా పనిచేసేవాడని పోలీసులు తెలిపారు. అధిక జీతాలు ఇవ్వడం ఎందుకనే ఉద్దేశంతో బస్సు యజమానికి హరికృష్ణ.. యువరాజను డ్రైవర్‌గా పెట్టుకున్నాడు.

ప్రయాణ సమయంలో సెన్సార్, ఇంజన...