భారతదేశం, సెప్టెంబర్ 15 -- భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో భద్రత ప్రమాణాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. భద్రతకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని కంపెనీగా ఒకప్పుడు పేరున్న మారుతీ సుజుకీ, ఇప్పుడు తన కొత్త మోడల్‌తో సరికొత్త రికార్డు సృష్టించింది. మారుతీ సుజుకీ విక్టోరిస్ ఎస్‌యూవీ గ్లోబల్ ఎన్‌క్యాప్ (Global NCAP) క్రాష్ టెస్ట్‌లో ఏకంగా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. భద్రత విషయంలో ఒకప్పుడు వెనుకబడిన మారుతీ సుజుకీ, ఇప్పుడు డిజైర్ తర్వాత 5 స్టార్ రేటింగ్ సాధించిన రెండో వాహనంగా చరిత్ర సృష్టించింది.

పెద్దల భద్రత (Adult Protection): పెద్దల భద్రత విషయంలో మారుతీ విక్టోరిస్ 32 పాయింట్లకు గాను 31.66 పాయింట్లు సాధించి అద్భుతమైన పనితీరును కనబరిచింది. ఈ స్కోరుతో, భారతదేశంలో ప్రస్తుతం అత్యధిక స్కోరు సాధించిన ఎస్‌యూవీగా విక్టోరిస్ నిలిచింది.

పిల్లల భద్రత (Chil...