భారతదేశం, ఆగస్టు 26 -- మాతా వైష్ణోదేవి యాత్ర మార్గంలో పెను ప్రమాదం జరిగింది. కొండచరియలు విరిగిపడటంతో ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం. అదే సమయంలో 14 మంది గాయపడినట్లు తెలుస్తోంది. జమ్ముకశ్మీర్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు యాత్రను నిలిపివేశారు. అలాగే భారత వాతావరణ శాఖ కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది.

మీడియా కథనాల ప్రకారం అర్ధ్కువారిలోని ఇంద్రప్రస్థ రెస్టారెంట్ సమీపంలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు మరణించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఉదయం యాత్రను నిలిపివేసినప్పటికీ పాత మార్గంలో మధ్యాహ్నం 1.30 గంటల వరకు కొనసాగింది. అయితే ఆ తర్వాత వాతావరణం అనుకూలించకపోవడంతో తాత్కాలికంగా నిలిపివేశారు.

జమ్మూలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్త...