Telangana,nalgonda, అక్టోబర్ 2 -- కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. బుధవారం రాత్రి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.

2004 నుంచి 2009 వరకు వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్ లోఐటీ మంత్రిగా పనిచేశారు. సూర్యాపేట, తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించారు. దామోదర్ రెడ్డి పార్థివదేహాన్ని ఇవాళ సూర్యాపేటకు తీసుకెళ్లి ప్రజల సందర్శనార్థం ఉంచాపు.

అంతిమ నివాళులు అర్పించేందుకు వీలుగా ఆయన అంత్యక్రియలు అక్టోబర్ 4న సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో జరుగుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. దామోదర్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఇతర నేతలు సంతాపం తెలిపారు.

Published by HT Digital C...