భారతదేశం, మే 22 -- ఒకవైపు ఇంటర్నెట్ ప్రపంచంలో తన కుమారుడు 'స్టార్' అయిపోయాడు. మరోవైపు దేశంలోని అతిపెద్ద రాజకీయ పార్టీల కంటే ఎక్కువ ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. కానీ, మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో నివసిస్తున్న భగవాన్ దిప్కే, అనిత దిప్కే దంపతులకు మాత్రం ఇవేవీ సంతోషాన్ని ఇవ్వడం లేదు. తమ కొడుకు అభిజీత్ దిప్కే తలపెట్టిన ఈ 'డిజిటల్ విప్లవం' ఎక్కడ అతని ప్రాణాల మీదకు తెస్తుందోనని ఆ తల్లిదండ్రులు వణికిపోతున్నారు.

ఇటీవల ఒక మరాఠీ వార్తా ఛానల్‌తో మాట్లాడిన వారు, తమ కుమారుడి రాజకీయ ప్రవేశంపై కుండబద్దలు కొట్టారు. "మాకు పాలిటిక్స్ అంటేనే అసహ్యం. అభిజీత్ రాజకీయాల్లోకి రావడం మాకు అస్సలు ఇష్టం లేదు" అంటూ వారు తమ మనసులోని మాటను బయటపెట్టారు.

ప్రస్తుత రాజకీయ వాతావరణం ఏమంత బాగోలేదని, అభిజీత్ భారత్‌లో అడుగుపెట్టగానే పోలీసులు అరెస్ట్ చేసి తీహార్ జైలుకు...