భారతదేశం, ఫిబ్రవరి 5 -- యూరిక్ యాసిడ్ పెరిగిందని రిపోర్టులో తేలగానే.. చాలామంది మొట్టమొదట చేసే పని మటన్, సీఫుడ్, పప్పులు, పనీర్ వంటి ప్రోటీన్ ఆహారాలను పూర్తిగా పక్కన పెట్టేయడం. అయినప్పటికీ చాలామందిలో యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గవు. మరి పొరపాటు ఎక్కడ జరుగుతోంది? దీనికి సమాధానం మాంసాహారంలో లేదు, మనం రోజూ తీసుకునే తీపి పదార్థాల్లో ఉందని చెబుతున్నారు ప్రముఖ జనరల్ ఫిజీషియన్, డయాబెటాలజిస్ట్ డాక్టర్ గగన్‌దీప్ సింగ్.

శరీరంలో ప్యూరిన్ (Purines) అనే రసాయన సమ్మేళనాలు విచ్ఛిన్నమైనప్పుడు ఒక వ్యర్థ పదార్థంగా యూరిక్ యాసిడ్ తయారవుతుంది. ఇది ఉండాల్సిన దానికంటే ఎక్కువైతే ఆ పరిస్థితిని వైద్య పరిభాషలో 'హైపర్‌యూరిసెమియా' (Hyperuricemia) అంటారు.

మనం తినే ఆహారం ద్వారానే యూరిక్ యాసిడ్ వస్తుందని అందరూ అనుకుంటారు. కానీ వాస్తవం వేరేలా ఉంది. మన శరీరంలోని యూరిక్ యాసి...