భారతదేశం, నవంబర్ 7 -- సూపర్ స్టార్ మహేశ్ బాబు-దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా SSMB29. ఈ సినిమా అప్డేట్ కోసం యావత్ సినీ లోకం ఎంతగానో ఎదురుచూస్తోంది. అంతా మహేశ్ బాబు లుక్ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో ఎస్ఎస్ఎంబీ29 నుంచి సడెన్ సర్‌ప్రైజ్ వచ్చింది. అయితే, అది మహేశ్ బాబు లుక్ కాదు. SSMB29 సినిమాలోని విలన్‌‌ను మొదటగా పరిచయం చేశారు డైరెక్టర్ రాజమౌళి. ఎవరు ఊహించని విధంగా ఎస్ఎస్ఎంబీ29 నుంచి మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.

ఎస్ఎస్ఎంబీ29 సినిమాలో హీరోగా మహేశ్ బాబు, హీరోయిన్‌గా గ్లోబల్ బ్యూటి ప్రియాంక చోప్రాతోపాటు హీరో, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి హీరో, హీరోయిన్లవి కాకుండా ముందుగా విలన్ రోల్‌ను పరిచయం చేశ...