భారతదేశం, డిసెంబర్ 31 -- 2025 ఏడాదికి వీడ్కోలు పలుకుతూ ప్రపంచమంతా కొత్త సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఘట్టమనేని వారింట పాత జ్ఞాపకాలు పలకరించాయి. మాజీ నటి, సూపర్ స్టార్ మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ 2025 ఏడాదికి సంబంధించిన అత్యంత మధురమైన క్షణాలను ఒక 'రీల్' రూపంలో సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఈ వీడియోలో మహేశ్ బాబు, గౌతమ్, సితారలతో కూడిన ఫ్యామిలీ ఫోటోలతో పాటు కొన్ని అరుదైన చిత్రాలు అభిమానులను కట్టిపడేస్తున్నాయి. ఈ రీల్‌లో అందరినీ ఆకర్షించింది మాత్రం గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. మహేశ్ బాబు భారీ చిత్రం 'వారణాసి'లో ప్రియాంక నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే నమ్రత, ప్రియాంకల మధ్య మంచి స్నేహం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి సరదాగా దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అలాగే, నమ్రత తన సోదరి శిల్పా శిరోద్కర్, దగ్...