భారతదేశం, నవంబర్ 22 -- భారత ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) మార్కెట్లో తనదైన ముద్ర వేసిన దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా.. తన ప్రీమియం ఎలక్ట్రిక్ కూపే ఎస్‌యూవీ 'ఎక్స్​ఈవీ 9ఈ'లో సరికొత్త 'స్పోర్టెక్ సిరీస్'ను వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రవేశపెట్టనుంది. ఈ ఎలక్ట్రిక్ కూపే ఎస్‌యూవీ మార్కెట్లోకి అడుగుపెట్టి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా కంపెనీ ఈ కీలక అప్‌డేట్‌ను సిద్ధం చేస్తోంది. గత ఆగస్టులో 'బీఈ 6 స్పోర్టెక్' మోడల్‌ను విడుదల చేసిన మహీంద్రా.. ఇప్పుడు అదే బాటలో ఎక్స్​ఈవీ 9ఈ స్పోర్టెక్ సిరీస్​ని తీసుకురానుంది. రివైజ్డ్​ వేరియంట్ల జాబితా, ఆకర్షణీయమైన కొత్త ఎక్స్‌టీరియర్ రంగులు, అదనపు సాంకేతిక ఫీచర్లతో ఈ కారు రానుంది.

బీఈ 6 మోడల్‌లో మహీంద్రా తన 'ఎంఏఐఏ' ఆర్కిటెక్చర్ ఆధారిత కొత్త సాఫ్ట్‌వేర్ ఫంక్షన్లు, అదనపు పెయింట్ ఫినిష్‌లతో కలిపి ఎనిమిది వేరియంట్లలో స్పో...