భారతదేశం, మే 9 -- Mahindra be 07 launch date : భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటున్న మహీంద్రా అండ్ మహీంద్రా.. మరో అద్భుతమైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని సిద్ధం చేస్తోంది. ఇప్పటికే మార్కెట్​లో సంచలనం సృష్టించిన ఎక్స్​ఈవీ 9ఈ, ఎక్స్​ఈవీ 9ఎస్, బీఈ 6 మోడళ్ల తర్వాత.. 'బీఈ 07' కాన్సెప్ట్ ఆధారంగా తన నాలుగో బోర్న్-ఎలక్ట్రిక్ వాహనాన్ని కంపెనీ తీసుకువస్తోంది. స్పోర్టీ లుక్‌తో ఉండే బీఈ 6 మోడల్ యువతను ఆకట్టుకుంటుండగా, ఈ బీఈ 07 మోడల్ మరింత హుందాగా, విశాలంగా, లగ్జరీగా ఉండబోతోంది.

మహీంద్రా బీఈ 07 డిజైన్ అత్యంత ఆకర్షణీయంగా, ఒక శక్తివంతమైన ఎస్‌యూవీకి ఉండాల్సిన అన్ని లక్షణాలతో తయారవుతోంది. ఇటీవల బయటకు వచ్చిన స్పై షాట్స్ ప్రకారం.. ఈ ఎలక్ట్రిక్​ కారు బాక్సీ షేప్‌లో, నిటారుగా ఉండే ఒక పటిష్టమైన ఎస్‌యూవీ రూపాన్ని కలిగి ఉంది....