భారతదేశం, డిసెంబర్ 24 -- మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. గత రెండు దశాబ్దాలుగా ఉప్పు-నిప్పులా ఉన్న థాకరే సోదరులు, ముంబై మున్సిపల్ ఎన్నికల సాక్షిగా మళ్ళీ ఒక్కటయ్యారు. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (UBT), రాజ్ థాకరేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నట్లు బుధవారం అధికారికంగా ప్రకటించాయి.

ముంబైలో బుధవారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఇద్దరు నేతలు వేదికను పంచుకున్నారు. "మహారాష్ట్ర ప్రజలు ఈ రోజు కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. శివసేన, MNS లు ఇకపై కలిసి పనిచేస్తాయని నేను ప్రకటిస్తున్నాను" అని రాజ్ థాకరే మరాఠీలో ఉద్వేగభరితంగా ప్రసంగించారు. మహారాష్ట్ర ప్రయోజనాలే తనకు అత్యంత ప్రధానమని ఆయన స్పష్టం చేశారు. ముంబై మేయర్ పీఠంపై కచ్చితంగా ఒక మరాఠీ వ్యక్తిని, అది కూడా తమ ర...