భారతదేశం, అక్టోబర్ 1 -- తెలంగాణలో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు మరోసారి సమ్మెకు సిద్ధమవుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడమే ఇందుకు కారణం. ఈరోజు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు అత్యవసరంగా సమావేశం అయ్యాయి. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించాయి. సమావేశం తర్వాత ఎఫ్‌ఏటీహెచ్ఐ ఛైర్మన్ రమేశ్ మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వం ఇంకా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయలేదని రమేశ్ చెప్పారు. ప్రభుత్వానికి విద్యారంగం ఆఖరి ప్రాధాన్యతాగా ఉందని విమర్శించారు. కిందటి నెల 21, 22 తేదీల్లో రూ.600 కోట్లు ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కేవలం రూ.200 కోట్లు మాత్రమే విడుదల చేశారని తెలిపారు.

దీపావళిలోపు రూ.1200 కోట్లు ఇస్తామన్నారని రమేశ్ అన్నారు. ఎలా ఇస్తారో చెప్పాలని అడిగారు. ఈ నెల 12 లోపు బకాయిలు చెల్లిం...