భారతదేశం, ఆగస్టు 22 -- బాలీవుడ్ నటి, ఫిట్‌నెస్ ప్రియురాలు మలైకా అరోరాకు వయసు 51 ఏళ్లు. కానీ ఆమెను చూస్తే ఆ వయసు అని ఎవరూ నమ్మలేరు. నిత్యం యవ్వనంగా, ఫిట్‌గా ఉండే మలైకా, తన సౌందర్యం, ఫిట్‌నెస్ రహస్యాలను ప్రముఖ నటి సోహా అలీ ఖాన్ పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు. ఆమెతో పాటు ప్రముఖ పోషకాహార నిపుణురాలు రుజుత దివేకర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సోహా అలీ ఖాన్.. మలైకా అరోరాను ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం ఏమిటని అడిగినప్పుడు, ఆమె ఒకే ఒక్క వాక్యంలో జవాబిచ్చారు. "వోకల్ ఫర్ లోకల్" (Vocal for Local) సిద్ధాంతాన్ని తాను నమ్ముతానని, దేశీయంగా లభించే ఆహారానికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. "దేశీ నెయ్యే నా సూపర్ ఫుడ్. నా జీవితంలో దీనికి నేను ఎప్పుడూ ప్రాధాన్యత ఇచ్చాను" అని మలైకా అన్నారు.

"నేను రుజుతను నేరుగా సంప్రదించకపోయినా, ఆమె ఫిట్‌నెస్ ఫిలాసఫీ నాకు తెల...