భారతదేశం, డిసెంబర్ 30 -- మలయాళ చిత్ర పరిశ్రమలో దిగ్గజ నటుడు, సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇంట్లో పెను విషాదం నెలకొంది. మోహన్ లాల్ మాతృమూర్తి శాంతకుమారి (90) మంగళవారం (డిసెంబర్ 30) మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. కొచ్చిలోని ఎలమక్కరలో ఉన్న మోహన్ లాల్ నివాసంలోనే ఆమె కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు.

శాంతకుమారి గత పదేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నారు. ఆ అనారోగ్యం కారణంగా ఆమె చాలా కాలంగా మంచానికే పరిమితమయ్యారు. తొలుత తిరువనంతపురంలో ఉన్న శాంతకుమారిని మెరుగైన చికిత్స కోసం మోహన్ లాల్ కొచ్చికి తీసుకువచ్చారు.

అక్కడే ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తూ, తన నివాసంలోనే ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. ఈ ఏడాది ఆగస్టు 10న ఆమె తన 90వ పుట్టినరోజును కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు.

తల్లి మరణ వార్త తెలిసే సమయానికి మోహన్ లాల్ కొచ్...