భారతదేశం, జూలై 24 -- నేటి ఆధునిక జీవనశైలి, అసమతుల్య ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో మలబద్ధకం (Constipation) ఒకటి. వారంలో మూడింటి కంటే తక్కువ సార్లు విసర్జన జరగడం, విసర్జన సమయంలో తీవ్ర ఇబ్బంది కలగడాన్ని మలబద్ధకంగా పేర్కొంటారు. తిన్న ఆహారం జీర్ణ వ్యవస్థలో నెమ్మదిగా కదలడం వల్ల పెద్దపేగు అధికంగా నీటిని పీల్చుకుని, వ్యర్థాలు గట్టిగా మారిపోవడం దీనికి ప్రధాన కారణం.

ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి, పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ సోనియా నారంగ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఉత్తమ ఆహార పదార్థాలను సూచించారు.

బొప్పాయిలో పాపైన్ (Papain) అనే సహజ జీర్ణ ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లను సులభంగా విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థలో ఆహారం సులభంగా కదిలేలా చేసి మలబద్ధకాన్ని అడ్డుకుంటుంది.

చిలగడ...