భారతదేశం, అక్టోబర్ 12 -- రాష్ట్రంలో రాబోయే రోజుల్లో మళ్లీ మార్పులు రానున్నాయి. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండగా... మరికొన్నిరోజుల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఫలితంగా ఉక్కపోతతో పాటు ఎండల తీవ్రత తగ్గే సూచనలున్నాయి.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం.... రాష్ట్రంలో రాబోయే కొన్ని రోజుల పాటు వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. అక్టోబర్ 15వ తేదీ వరకు కూడా పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుంది. ఎలాంటి హెచ్చరికలు జారీ కాలేదు.

ఇక అక్టోబర్ 16 ఉదయం నుండి అక్టోబర్ 18 ఉదయం వరకు వాతావరణంలో మార్పులుంటాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. కానీ ఎలాంటి హెచ్చరికలు అయితే జారీ లేవు.

గడిచిన వారం రోజులుగా ఎండలు మండు ...