భారతదేశం, డిసెంబర్ 31 -- 2025 ఏడాది ముగింపుకు చేరుకుంది. మరికొన్ని గంటల్లో న్యూ ఇయర్ 2026 వచ్చేయనుంది. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ సినీ ప్రియులను అలరించేందుకు ఓటీటీ సంస్థలు సరికొత్త వినోదంతో రెడీగా ఉన్నాయి. థ్రిల్లర్స్, రొమాంటిక్ డ్రామాలు, యాక్షన్ సినిమాలు.. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ ఓటీటీ సినిమాలు ఉన్నాయి. ఈ న్యూ ఇయర్ ఓటీటీలో చూడాల్సిన ది బెస్ట్ సినిమాలు ఏంటో ఇక్కడ చూద్దాం.

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్న 'స్ట్రేంజర్ థింగ్స్' సీజన్ 5 ఫినాలే ఎపిసోడ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. హాకిన్స్‌ను రక్షించేందుకు వెక్నాతో సాగే ఈ చివరి పోరాటం సైన్స్ ఫిక్షన్ ప్రియులకు పండుగే అని చెప్పాలి. ఈ ఫ్రాంఛైజీ మొత్తం న్యూ ఇయర్‌లో చూసేందుకు బెస్ట్ ఆప్షన్. ఇది తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

మలయాళ మిస్టరీ థ్రిల్లర్ '...