Telangana,hyderabad, ఆగస్టు 27 -- ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం కొనసాగుతోంది. పశ్చిమ-వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతూ అదే ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా బలపడిందని వాతావరణశాఖ తెలిపింది. ఇది 24గంటల్లో ఒడిశా మీదుగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం... ఇవాళ కొత్తగూడెం, భూపాలపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

రేపు (ఆగస్ట్ 28) ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడొచ్చు. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరు...