భారతదేశం, ఫిబ్రవరి 13 -- మెగాస్టార్ చిరంజీవి నటించి సూపర్ హిట్ కొట్టిన లేటెస్ట్ ఫ్యామిలీ కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్‌లో అలరించిన ఈ సినిమాకు హిట్ మేషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా బాక్సాఫీస్ బరిలోకి జనవరి 12న థియేటర్లలో విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు సినిమా మంచి హిట్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఏంగా రూ. 350 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి రీజనల్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది ఈ సినిమా.

అలాంటి మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ రిలీజ్ అయి కూడా దూసుకుపోతోంది. ఫిబ్రవరి 11 నుంచి జీ5లో తెలుగులో మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఓటీటీలోనూ ఈ మూ...