భారతదేశం, జూలై 22 -- పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న అడవి ఏనుగుల బెడదపై ప్రభుత్వం స్పందించింది. డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో. అటవీ శాఖ అధికారులు కార్యాచరణను సిద్ధం చేశారు. జిల్లా వాసులకు ఈ సమస్య నుంచి ఉపశమనం కలిగించే లక్ష్యంతో, పలమనేరులోని ముసలమడుగు క్యాంపు నుంచి రెండు ప్రత్యేక కుంకీ ఏనుగులను మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపునకు తరలించనున్నారు.

రాష్ట్రంలోని నానియాల్ ఏనుగుల శిబిరంలో సుదీర్ఘకాలం ప్రత్యేక శిక్షణ పొందిన 'జయంత్' అనే కుంకీ ఏనుగుతో పాటు, కర్ణాటక నుంచి తీసుకువచ్చిన 'అభిమన్యు' అనే మరో కుంకీని మన్యం జిల్లాకు పంపాలని ఉప ముఖ్యమంత్రి అటవీ అధికారులను ఆదేశించారు. మానవ-ఏనుగుల మధ్య జరిగే సంఘర్షణలను సమర్థవంతంగా అరికట్టడంలో ఈ రెండూ అత్యంత అనుభవం కలిగినవిగా పేరుగాంచాయి.

ఇటీవల కాలంలో అభిమన్యు, జయంత్‌లు అత్యంత సం...